తెలంగాణ

Cancer Awareness: భక్తి పేరుతో ఆరోగ్యాన్ని బలి చేస్తున్నామా! అగరబత్తి, దోమల కాయిల్స్‌తో క్యాన్సర్ వస్తుందా?

Cancer Awareness: చాలా మంది వారి పూజ గదిల్లో దేవుడి ఫోటోల ముందు అగరబత్తి వెలిగించని మొక్కులు చెల్లించుకోవడం సాధారణంగా మనం చూస్తుంటాం. సువాసనల కోసం, పవిత్రత కోసం నిత్యం ధూపం వేయడం ఎప్పటి నుంచో వస్తున్న మన సంప్రదాయం. మరోవైపు రాత్రిపూట దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి దోమల కాయిల్స్ వెలిగించి నిద్రపోవడం కూడా కామన్. అయితే ఈ పొగను పీల్చడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్ వస్తుందా? సిగరెట్ కంటే ఈ పొగే అత్యంత ప్రమాదకరమా? అనే భయాందోళనలు సోషల్ మీడియా వేదికగా నిత్యం కలకలం రేపుతూనే ఉన్నాయి. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? వైద్య నిపుణులు, శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయి..అగరబత్తులు, దోమల కాయిల్స్ కాలినప్పుడు కేవలం సువాసన మాత్రమే వెలువడదు. వాటి నుంచి అతి సూక్ష్మ కణాలు, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వంటి ప్రమాదకర రసాయనాలు గాలిలోకి రిలీజ్ అవుతాయి. ఈ కణాలు గాలిలో ఎక్కువసేపు తేలియాడుతూ ఉండటం వల్ల శ్వాస ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి చేరతాయి.