International

CanadaVisa: కెనడా వెళ్లాలనుకునే విద్యార్థులకు బిగ్ షాక్.. కొత్త వీసా లెక్కలివే!

CanadaVisa: ఉన్నత చదువులు, ఉపాధి కోసం కెనడా వెళ్లాలని కలలు కంటున్న విదేశీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. పెరిగిపోతున్న వలసల ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాత్కాలిక వలసలపై కఠిన ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటా కేవలం 1.5 లక్షల మంది విదేశీ విద్యార్థులను మాత్రమే తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించింది. కెనడా ప్రభుత్వం విడుదల చేసిన ఈ కొత్త వీసా లెక్కలతో వేలాది మంది భారతీయ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా వెల్లడించిన వివరాల ప్రకారం.. 2027 నుంచి 2029 వరకు ఏటా గరిష్టంగా 3.7 లక్షల మంది తాత్కాలిక వలసదారులకు మాత్రమే పర్మిషన్ లభించనుంది.