క్రైమ్

నదిలో స్నానం చేద్దామని బాలికను పిలిచి..!

ఓ మైనర్ బాలికను వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి రేప్ చేసి చంపేశాడు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలోని మార్దు గ్రామంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. భగవత్ మెహతో(23) అనే యువకుడు నదిలో స్నానం చేద్దామని చెప్పి 17 ఏళ్ల మైనర్ బాలికను పిలిచాడు. ఐదు నిమిషాల్లో తిరిగి వస్తానని ఇంట్లో చెప్పి భగవత్ వద్దకు బాలిక వెళ్లింది. అతను నది వద్దకు కాకుండా చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఈ విషయం ఎవరికైనా చెప్తుందన్న భయంతో బాలికను దారుణంగా హతమార్చాడు.అనంతరం ఏమీ ఎరుగనట్టు ఘటనా స్థలం నుంచి మెహతో వెళ్లిపోయాడు. కుమార్తె సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సాయంతో చుట్టూ వెతకడం ప్రారంభించారు.ఎంత వెతికినా జాడ దొరక్కపోవడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.