టాప్ న్యూస్
Cab Driver Tip Rules: క్యాబ్ బుక్ చేస్తున్నారా? అయితే ఇకపై ఈ పని చేయొద్దు!!
దేశంలో ఓలా, ఉబర్ వంటి ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న ముందస్తు అదనపు బాదుడుకు కేంద్ర ప్రభుత్వం కట్టడి దిశగా ముకుతాడు వేసింది. క్యాబ్ బుకింగ్ చేసుకునే సమయంలో ప్రయాణానికి ముందే ‘టిప్ ఇస్తారా?’ అని అడిగే ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అన్ని అగ్రిగేటర్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో యాప్‌లను వెంటనే సమీక్షించి, ప్రయాణికులకు కనిపించే ముందస్తు టిప్పింగ్ ఆప్షన్లు, ప్రాంప్ట్‌లను శాశ్వతంగా తొలగించాలని స్పష్టం చేసింది.
