ఉపఎన్నిక ఫలితాలు.. పుదుచ్చేరిలో కాంగ్రెస్ అభ్యర్థి విక్టరీ
దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని తట్టంచవడి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగ్గా ఇప్పటికే కౌంటింగ్ పూర్తయి ఫలితాలు వెలుబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశోక్ ఆనంద్ ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఇ.వినాయగంపై ఏకంగా 8,482 ఓట్ల తేడాతో అశోక్ విజయం సాధించడం గమనార్హం. అధికార పార్టీ నేత విజయం సాధించడంతో కార్యకర్తలు, నేతలు సంబురాల్లో మునిగిపోయారు.ఇదిలాఉండగా, తట్టంచవడి అసెంబ్లీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2026లో జరిగిన అసెంబ్లీ జనరల్ ఎన్నికల్లో రంగస్వామి రెండు స్థానాల నుండి బరిలో దిగారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆయన విజయం సాధించడంతో తట్టంచవడి స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
