National
BY Election Result 2026: నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు.. సత్తా చాటిన టీవీకే-బీజేపీ!..
రాజకీయ సవాళ్లు, ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతూ తమిళనాడులో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ సంచలన విజయాలు సాధించింది. గతంలో ఎదురైన ఇబ్బందులన్నింటినీ దాటుకుంటూ టీవీకే అభ్యర్థులు ఘనవిజయం సాధించడంతో పార్టీ వర్గాల్లో ఉత్సాహం కనిపిస్తుంది. ఇక ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి పి. సత్యభామ భారీ ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేశారు.
