డోర్లు మూశాకే బస్సులు కదలాలి.. ఆర్టీసీ సంచలన నిర్ణయం
ఆర్టీసీ బస్సులకు డోర్లు అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా కండక్టర్ ప్రవళిక మృతితో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే అన్ని బస్సుల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ఉత్వర్వులు వెలువడ్డాయి. తలుపులు మూశాకే బస్సులు ముందుకు కదలాలని ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. ఇది అన్ని రకాల బస్సులకు వర్తిస్తుందని టీజీఎస్ ఆర్టీసీ స్పష్టంచేసింది. ముందుగా రాష్ట్రంలో డోర్లు లేని బస్సులను గుర్తించి వెంటనే అమర్చాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది. ఇదిలాఉండగా, రాష్ట్రంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులకు మాత్రమే డోర్లు ఉన్నాయి. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు, నగరంలో నడిచే సిటీ బస్సులకు డోర్లు అసలే లేవు. సిటీ బస్సుల్లో ముందు, వెనుక నుంచి ఎక్కే సదుపాయం ఉన్నందున రెండు వైపులా డోర్లు అమర్చాల్సి ఉంటుంది.
