తెలంగాణ

కన్నం వేసిన ఇంట్లో దొంగ జల్సా.. రెండ్రోజులు హాయిగా!

దొంగలు ఇటీవలి కాలంలో కొన్ని విచిత్ర పనులు చేస్తూ దొరికిపోతున్నారు.దొంగతనం చేసే క్రమంలోనే వారు అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చోరీకి వెళ్లిన దొంగ సాధారణంగా ఇంట్లో ఉన్నవి ఊడ్చేసి ఆ వెంటనే పరార్ అవుతాడు. కానీ, కొందరు ఈ మధ్యకాలంలో దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడి జల్సాలు చేస్తున్నట్టు సమాచారం. కొందరు ఇంట్లో ఉన్న మందు బాటిళ్లు తాగి అక్కడే నిద్రపోవడం వంటివి చేస్తున్నారు. మరికొందరు కిచెన్‌లోకి చొరబడి ఇంట్లోని ఫుడ్ ఐటమ్స్ తేరగా లాగించేస్తున్నారు. అయితే, ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఓ దొంగ ఇంట్లో చొరబడి రెండ్రోజులు అక్కడే హాయిగా నిద్రపోయినట్టు తెలిసింది. ఓనర్లు వచ్చి చూసి ఫిర్యాదు చేయగా అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.