National
Bullet train: హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణంపై బిగ్ అప్ డేట్!..
ప్రతిష్టాత్మక హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అడుగు పడింది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్, సబ్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక స్థలాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు.
