క్రైమ్

బండ్లగూడ వైన్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య.. వీడియో వైరల్

హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని కొందరు వెంటబడి మరి నరికి చంపారు. ఈ ఘటన నగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు.సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మహమ్మద్ నహీమ్ ఇల్లందు నుంచి నగరానికి వచ్చి బండ్లగూడ సహభావన అపార్ట్‌మెంట్లో నివాసముంటున్నాడు. విషయం తెలుసుకున్న మహేశ్.. అతన్ని అంతం చేయాలని తిరుగుతున్నట్టు సమాచారం. మహేశ్ తనను ఎక్కడ చంపేస్తాడో అని భయంతో బండ్లగూడలోని సుప్రీం వన్స్ షాపులో తలదాచుకున్న నయీమ్‌ను.. మహేశ్ మరికొందరి సాయంతో మర్డర్ చేసినట్టు తెలిసింది.