క్రైమ్
అక్కకు ఆస్తి రాదేమోనని..బావపై కిరాతకం
ఆస్తిలో తన అక్కకు ఎక్కడ వాటా రాకుండా పోతుందో అని సొంత బావను..బావమరిది సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలీలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కోటి వీరనాగయ్య అనే వ్యక్తికి వివాహం జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. ఆయన వ్యాపారం చేస్తుంటాడు. అయితే, వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం కాస్త ఆయన భార్య, బావమరిదికి తెలిసింది. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు వీరనాగయ్యను హెచ్చరించారు. బావ పేరిట ఉన్న ఆస్తి తన అక్క, పిల్లలకు ఎక్కడా దక్కకుండా పోతుందోనని భావించిన బావమరిది రాజేశ్.. బావ వీర నాగయ్య హత్యకు కుట్ర పన్నాడు. ఇందుకోసం రూ.4 లక్షలకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్లాన్ ప్రకారం బావను కిడ్నాప్ చేయించి హత్య చేయించాడు.
