తెలంగాణ

Crime : ఏకాంతంగా ఉన్నప్పుడు చూశాడని బాలుడిపై కిరాతకం!

వివాహేతర సంబంధాల ముసుగులో కొందరు దారుణాలకు తెగబడుతున్నారు. చంపడానికి లేదా చావడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ వివాహిత ఆమె ప్రియుడితో కలిసి ఓ బాలుడిని దారుణంగా హత్యచేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి జారుకునేందుకు ప్లాన్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వారి గుట్టు రట్టయింది. ఈఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకొరుకొండలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకివెళితే.. అపర్ణ అనే మహిళ భర్తతో విడిపోయి తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది.ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన అజయ్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.వీరిద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు రవి (15) అనే బాలుడు చూశాడు. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్తానని హెచ్చరించడంతో అతని హత్యకు అపర్ణ తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే గత నెల 24వ తేదీన మాయమాటలు చెప్పి బాలుడిని ఊరి బయటకు తీసుకెళ్లారు ఇద్దరు. అక్కడ కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి అతనితో తాగించారు.