క్రైమ్
ఆస్తి కోసం కిరాతకం.. తమ్ముడి భార్యను హతమార్చిన అన్నలు
రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం సొంత తమ్ముడి భార్యను అన్నలు కిరాతకంగా హతమార్చారు.ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ్ముడు ఊర్లో లేని సమయంలో అత్యంత కిరాతకంగా మరదలిని హతమార్చడంతో మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం చింతల్తండాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. 12 ఏళ్ల కిందట బలరాం అనే వ్యక్తితో సునీత(28)కు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. బలరాంకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఏడాది క్రితం పంచాయితీ పెట్టి భార్య సునీత పేరిట ఎకరంన్నర భూమిని పట్టా చేయించారు. ఇది బలరాం అన్నలు పాండునాయక్, మన్యానాయక్కు నచ్చలేదు. ఎలాగైనా ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ వేశారు.
