తెలంగాణ
భూ కేటాయింపులపై బీఆర్ఎస్ డ్రామాలు.. ఢిల్లీ వేదికగా ఎంపీ చామల ఫైర్!
హైదరాబాద్ సమీపంలోని ఫ్యూచర్ సిటీలో టెస్సరాక్ట్ (Tesseract) సంస్థకు సేకరించిన భూముల కేటాయింపు ప్రక్రియపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ అనవసర రాజకీయం చేస్తోందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. న్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పారదర్శకమైన పాలన అందిస్తోందని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు నిబంధనలకు కట్టుబడి మాత్రమే భూ కేటాయింపులు జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుతూ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పక్కా గణాంకాలతో ఆరోపణలను తిప్పికొట్టారు.
