తెలంగాణ
Telangana Politics: కంచుకోటలో వణుకు.. బీఆర్ఎస్ మాజీలకు కేసీఆర్ బిగ్ షాక్!
Telangana Politics: తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్కు కంచుకోటగా నిలిచిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గులాబీ శిబిరంలో ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ ప్రకంపనలు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు వరుస విజయాలతో ఎదురులేని ఆధిపత్యం చలాయించిన మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేల గుండెల్లో ఇప్పుడు టికెట్ భయం పట్టుకుంది. గత శాసనసభ ఎన్నికల్లో మార్పులు చేయకుండా సిట్టింగ్‌లందరికీ మూకుమ్మడిగా టికెట్లు ఇవ్వడమే పార్టీ ఓటమికీ ప్రధాన కారణమనే క్లారిటీకి వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్, ఈసారి పాత తప్పులను రిపీట్ చేయకూడదని గట్టి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. రాబోయే ఎన్నికల కోసం జిల్లావ్యాప్తంగా సాగుతున్న అంతర్గత రహస్య సర్వేలు, అధిష్ఠానం చేపట్టిన సీక్రెట్ ప్రక్షాళన మాజీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
