తెలంగాణ

పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలకు ఇదే గతి- కేటీఆర్

KTR: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. దానంపై అనర్హత వేటు వేసింది. దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పు వెలువరించింది న్యాయస్థానం. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

దానంపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ప్రకటించిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ హైకోర్టు తీర్పుపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘సత్యమేవ జయతే’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు కేటీఆర్.