తెలంగాణ
భవిష్యత్తు బాగుండాలంటే సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలి-కేటీఆర్
Ktr: దేశ పరిస్థితులు చూస్తుంటే బాధేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాపోయారు. పాలకులకు దేశంపై సరైన అవగాహన లేదని విమర్శించారు. మతం మత్తులో పడి దేశం వెనక్కి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం అన్న కేటీఆర్.. దేశం శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం అని చెప్పారు. మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలన్నారు. వారికి భవిష్యత్తు ఉండాలంటే సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు.
