తెలంగాణ
ఢిల్లీకి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు..
TG: తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి ఢిల్లీకి బయలుదేరారు. అక్కడ వారు జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్కు కంప్లైంట్ చేయనున్నారు.
ఇటీవల అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది. మహిళా ప్రజాప్రతినిధులతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు జుట్టు పట్టుకుని లాగినట్లు ఆరోపణలు రావడం తీవ్ర వివాదానికి దారితీసింది.
