తెలంగాణ

బీఆర్ఎస్ మళ్లీ నీళ్ల సెంటిమెంట్ పాలిటిక్స్‌.. డ్యామేజ్ కంట్రోల్ కోసమేనా?

TG: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ‘సెంటిమెంట్’ అస్త్రం తెరపైకి వచ్చింది. ఉద్యమ కాలం నుంచి పార్టీని నడిపించిన ప్రధాన భావోద్వేగాలను గులాబీ దళం మళ్లీ రాజేసే పనిలో పడినట్లు కనిపిస్తుంది. అయితే ఈసారి ఈ అంశం తెరపైకి రావడం వెనుక కేవలం ప్రజా సమస్యలే కారణమా? లేక వరుస ఆరోపణలతో ఇరుకున పడ్డ పార్టీని గట్టెక్కించే సరికొత్త డ్యామేజ్ కంట్రోల్ వ్యూహమా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది.గత కొద్ది రోజులుగా రాజధాని శివార్లలోని చెరువులు, బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ పరిధుల్లో అక్రమ నిర్మాణాలు, ఫామ్‌హౌస్‌ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్‌తో పాటు క్షేత్రస్థాయి యంత్రాంగం దూకుడు పెంచడంతో గులాబీ కీలక నేతలపై భూ కబ్జా ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి.