తెలంగాణ

నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్.. నేరెళ్ల బాధితులను వంచించారు : కవిత

గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారుపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.నేరెళ్ల బాధితులను బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ కుమ్మక్కై దగా చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ మండిపడ్డారు. ఆదివారం బంజారాహిల్స్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2017లో ఇసుక మాఫియాను అడ్డుకున్న నేరెళ్ల దళిత, బడుగు వర్గాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు సాగించిన దాష్టీకాలను మరోసారి గుర్తుచేశారు. నేరేళ్ల బాధితుల దుఃఖాన్ని రాజకీయంగా వాడుకుని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, తీరా గద్దెనెక్కాక అసలు వాళ్లు బాధితులు అనడానికే ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు చెప్పడం చూస్తుంటే ప్రతిపక్ష, అధికార పార్టీలు కుమ్మక్కు అయ్యాయని స్పష్టంగా అర్థం అవుతోందన్నారు.