కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ‘ఎస్ఐఆర్’ పావుగా వాడుకుంటున్నారని చెప్పారు. శనివారం కొడంగల్‌లోని తన నివాసంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్‌కు గుర్తింపు వచ్చిందన్నారు. ఇక్కడి ప్రజల అభిమానమే తన బలమని ముఖ్యమంత్రి వెల్లడించారు. మోడీ సర్కార్ SIR పేరుతో నాటకాలు ఆడుతోందని, కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర, బిహార్, బెంగాల్ ఎన్నికల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేసి గెలిచారన్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
