తెలంగాణ
కేసీఆర్ చెప్పారు.. కేటీఆర్, హరీష్ చేశారు! బీఆర్ఎస్ స్ట్రీట్ ఫైట్ వెనుక వ్యూహమేంటి..?
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ తన పాత పోరాట పంథాలోకి అడుగుపెడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ నిన్న ఇచ్చిన పిలుపు.. అసెంబ్లీ వేదికగా అమల్లోకి వచ్చింది. కేటీఆర్, హరీష్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోడ్డుపైకి వచ్చి నిరసనకు దిగడం, పోలీసులు అదుపులోకి తీసుకోవడం.. ఇవన్నీ చూస్తే ఇది యాదృచ్ఛికంగా జరిగిన నిరసన కాదనే అభిప్రాయం కలుగుతోంది.
