తెలంగాణ
BRS: ఆర్టీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మౌనం.. అసలు ప్లాన్ ఇదేనా?
తెలంగాణ ఆర్టీసీలో చాలా కాలం తర్వాత జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. వివిధ కార్మిక సంఘాలు హోరాహోరీగా తలపడుతుండగా.. అధికార కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న సంఘాలకు కొన్ని యూనియన్లు మద్దతు ప్రకటించాయి. గతంలో ప్రత్యర్థులుగా తలపడిన సంఘాలు ఇప్పుడు ఒక్కటవడంతో ఎన్నికల సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
