తెలంగాణ

రెండున్నరేళ్లలో రూ.50వేల కోట్లు దోచేశారు.. సీఎం రేవంత్ కుటుంబంపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆస్తుల వివాదం తారస్థాయికి చేరింది. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ఉద్యమం పేరుతో వేల కోట్ల ఆస్తులు సంపాదించారని, వందల ఎకరాల భూములు కబ్జా చేశారని చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. దీనికి బీఆర్ఎస్ నాయకులు అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్, ఆయన కుటుంబం వేల కోట్ల రూపాయలు దోచేసిందని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ రెండున్నరేళ్లలో అనుముల కుటుంబం తెలంగాణ మీద పడి దోచుకున్న సొమ్ము అక్షరాల రూ.50వేల కోట్లు అంటూ ఆరోపించింది. ముఖ్యమంత్రి పదవిని వాడుకుని రేవంత్ రెడ్డి తెలంగాణను లూటీ చేస్తున్నారని విరుచుకుపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పోస్టు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది.