తెలంగాణ

నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ 'రైతు గర్జన'.. కేటీఆర్ సుడిగాలి పర్యటన!

 మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు (ఆదివారం) ఆదిలాబాద్ జిల్లాలో బిజీ బిజీగా పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ తలపెట్టిన ‘రైతు గర్జన’ సభలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నార్సింగి నివాసం నుంచి ఉదయం 9:30 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గాన ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు ఆయన పయనమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ మధ్యాహ్నం 1 గంటకు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని అక్కడ భోజనం చేయనున్నారు.