National
BRS: అటు కాంగ్రెస్‌తో కలవలేక.. ఇటు బీజేపీ ముద్ర పడనీయక.. గులాబీ పార్టీలో డైలమా!
BRS: దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి ఎన్నికల సంఘం తీరుపై, 'స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్' (సర్) వ్యవహారంపై కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తుంటే.. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ మాత్రం ఎటూ తేల్చుకోలేక తీవ్ర అయోమయంలో పడింది. అటు కాంగ్రెస్ నడుపుతున్న ఆందోళనల్లో భాగస్వామ్యం కాలేక, ఇటు బీజేపీకి అనుకూలమనే ముద్ర పడకుండా కాపాడుకోలేక గులాబీ బాస్‌లు తీవ్ర సందిగ్ధాన్ని ఎదుర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి దుమ్మురేపుతున్న వేళ, బీఆర్‌ఎస్ వైఖరి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
