బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు రిలీఫ్..
TG: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత కామెంట్స్ చేశారన్న కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. వీరిని రిమాండ్‌కు పంపాలన్న పోలీసుల అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగత పూచీకత్తుపై రిలీజ్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. రూ.10 వేల చొప్పున పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీలను సమర్పించాలని సూచించింది.
స్పీకర్‌ను కులం పేరుతో దూషించడంతో పాటు అసభ్య పదజాలం ఉపయోగించారంటూ స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు వారిద్దరిపై కేసు నమోదైంది.ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజు ఉదయం పోలీసులు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం వారి రిమాండ్‌ను తిరస్కరిస్తూ న్యాయస్థానం బెయిల్ తరహా వ్యక్తిగత పూచీకత్తుపై రిలీజ్‌కి ఆదేశించింది
