తెలంగాణ
ఎల్‌నినోపై క్యాబినెట్ సబ్ కమిటీ.. సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ బహిరంగ లేఖ
Elnino: ఎల్ నినోపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పందించారు. సీఎం రేవంత్, మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యులకు 23 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ సంధించారు. సంక్షోభం వచ్చి ఆరు నెలలయ్యాక ‘ఉపసంఘం’ డ్రామానా? అని లేఖలో మండిపడ్డారు. ఎల్ నినో విపత్తు ముమ్మాటికీ రేవంత్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే అని ధ్వజమెత్తారు. పంటలు ఎండిపోయాక, వర్షాకాలం ముగిశాక కమిటీ వేయడం ప్రజా వంచన కాదా? అని నిలదీశారు.
