బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్డగింత.. అసెంబ్లీలో వాయిదా తీర్మానం
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన తమ పార్టీ శాసనసభ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులకు ఆ అధికారం ఎక్కడిదని ప్రశ్నించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను అలా ఎలా అడ్డుకుంటారని, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.రేవంత్ ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను గుర్తుచేసేందుకు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చామని పేర్కొంటున్నారు. నల్లదుస్తులు ధరించి అసెంబ్లీకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం, అందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్నటి ఘటనపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీకి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నందుకు.. దీనిపై చర్చ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
