తెలంగాణ

అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం.. రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ నిప్పులు!

 తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం కొనసాగుతోంది. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ 20ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అసభ్యకర భాష ఎప్పుడూ వినలేదని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. గతంలో స్వయంగా తానేం మాట్లాడారో, ఎలాంటి పదజాలం ఉపయోగించారో తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసని పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు.