తెలంగాణ

కవిత నిర్వాకంతో కేసీఆర్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు

Vemula Prashanth Reddy: టీఆర్ఎస్ చీఫ్ కవిత తన గురించి చేసిన విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తనపై కవిత చేసిన ఆరోపణలను వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. కష్టకాలంలో ఉన్న కేసీఆర్ ను వదిలేసి వెళ్లింది కవితే.. నేను కాదు అని ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

కేసీఆర్ ప్రధాన అనుచరులను కవిత టార్గెట్ చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కవిత నిర్వాకంతో ఆమె తండ్రి కేసీఆర్ తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారని ప్రశాంత్ రెడ్డి వాపోయారు. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై తాను పోరాటం చేస్తూనే ఉన్నానని తెలిపారు. తాను కాంగ్రెస్ తో సంప్రదింపులు జరిపానని కవిత చెప్పడం పూర్తిగా అవాస్తవం అన్నారు. తనపై కవిత చేసిన ఆరోపణలు అర్థరహితం, నిరాధారం అని చెప్పారు. కవిత కాంగ్రెస్ నేతలను రహస్యంగా కలిశారా? లేదా? వారితో సంప్రదింపులు జరిపారా? లేదా? అన్న విషయం చెప్పగలరా అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.