తెలంగాణ
BRS: పోగొట్టుకున్న చోటే బీఆర్ఎస్ వేట.. గులాబీ బాస్ బిగ్ స్కెచ్!
తెలంగాణలో అధికార పగ్గాలు కోల్పోయిన బీఆర్ఎస్ ఇప్పుడు అసలుసిసలైన ఆత్మపరిశీలనలో పడింది. తాము అధికారం ఎక్కడ కోల్పోయామో గుర్తించిన గులాబీ దళం.. సరిగ్గా అక్కడే మళ్లీ పుంజుకోవడానికి పక్కా కార్యాచరణతో రణరంగంలోకి దిగుతోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్కు తిరుగులేని కంచుకోటగా నిలిచిన సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. సుమారు 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు విస్తరించి ఉన్న ఈ బొగ్గు గని ప్రాంతంలో.. కార్ పార్టీ కేవలం ఆసిఫాబాద్ ఒక్క స్థానానికే పరిమితమై దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ చేదు నిజాన్ని గుర్తించిన బీఆర్ఎస్ అధిష్టానం, పోగొట్టుకున్న చోటే మళ్లీ పూర్వ వైభవాన్ని వెతుక్కునేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.
