తెలంగాణ
BRS: బీఆర్‌ఎస్ రాజీలేని పోరాటం.. సుప్రీంకోర్టులో దానం ఎమ్మెల్యే కథ క్లోజ్! గులాబీ శ్రేణుల్లో సంబరాలు..
BRS: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై తాము సాగించిన న్యాయపోరాటం చారిత్రాత్మక విజయాన్ని అందుకుందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో పాటు, ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కూడా వీగిపోయింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ కార్యాలయం నుంచి సుప్రీంకోర్టు గడప వరకు గులాబీ దళం అలుపెరగకుండా సాగించిన సుదీర్ఘ న్యాయపోరాటం ఫలితంగానే ఈ తీర్పు వెలువడిందని ఆ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.
