తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లదుస్తులు ధరించి రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులను లోనికి అనుమతించబోమని స్పష్టంచేశారు. ప్లకార్డులు వదిలేసి, నల్లదుస్తులు తీసేసి రావాలని చెప్పడంతో శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎవరు మమ్మల్ని అడ్డుకోవడానికి అని మండిపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టడానికి ప్రయత్నించడంతో కేటీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు తోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా,అరెస్టు అయిన నేతలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అంతా అక్కడ భేటీ అయ్యారు. తోపులాటలో భాగంగా కేటీఆర్,హరీశ్ రావుకు స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం.వారికి వైద్యులు చికిత్స అందించినట్టు సమాచారం.
