తెలంగాణ
BRS: బావా బావమర్ది షేరింగ్.. గులాబీ దళం పక్కా ప్లాన్‌తో కాంగ్రెస్‌కు చిక్కులు తప్పవా?
BRS: తెలంగాణ రాజకీయాల్లో మరో బిగ్ ఫైట్‌కు తెరలేచింది. వచ్చే మార్చిలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్.. ఊహించని రీతిలో భారీ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. పేరుకు ఇవి రెండే సీట్లు అయినా.. ఏకంగా 6 ఉమ్మడి జిల్లాలు, దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి వీటి కిందకు వస్తాయి. దీంతో ఈ రెండు స్థానాల్లో గులాబీ జెండా ఎగరేసి, అధికార కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేసేందుకు పార్టీలోని ఇద్దరు కీలక పిల్లర్లు కేటీఆర్, హరీష్ రావు చెరో సీటును పంచుకున్నారనే వార్త ఇప్పుడు తెలంగాణ భవన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాల్లో విద్యావంతులైన ఓటర్లు తీర్పు ఇచ్చే ఈ ఎన్నికల్లో గెలిచి కేడర్‌లో నూతనోత్సాహం నింపాలని గులాబీ దళపతి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.
