తెలంగాణ
BRS : కొడంగల్లోనే సీఎంకు చెక్.. గులాబీ దళం పక్కా స్కెచ్ ఇదేనా!
తెలంగాణ రాజకీయ సంగ్రామంలో ఇప్పుడు ఊహించని సభల యుద్ధం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎదురుదాడికి దిగారు. కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో నిప్పులు చెరిగి, తదుపరి లక్ష్యంగా హరీశ్ రావు అడ్డా సిద్దిపేటను ఎంచుకోవడంతో గులాబీ శిబిరం ఆత్మరక్షణలో పడిందని భావించిన వారికి.. బీఆర్ఎస్ ఇప్పుడు ఊహించని ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిని ఆయన సొంత గడ్డపైనే సవాలు చేస్తూ.. కొడంగల్లోనే భారీ పొలిటికల్ బాంబు పేల్చేందుకు గులాబీ దళం పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
