తెలంగాణ

పొంగులేటి, పీసీసీ చీఫ్, పెద్దపల్లి ఎంపీకి బీఆర్ఎస్ నోటీసులు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద నిరాధార ఆరోపణలు చేసిన వారిపై బీఆర్ఎస్ లీగల్ టీం ఘాటుగా రియాక్ట్ అయ్యింది. కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ తన ఫాంహౌస్‌కు మళ్లించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, రెవెన్యూ, గృహ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణలకు బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ నోటీసులు జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రెటరీ, లీగల్‌ సెల్‌ ఇన్‌‌చార్జి సోమ భరత్‌ కుమార్‌ నోటీసులు జారీ చేశారు.ఇదే విషయంలో ‘వెలుగు’ దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు సైతం నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.ఎందుకంటే సదరు దినపత్రికలో వచ్చిన కథనాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆరోపించింది.ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు నోటీసులు పంపించారు.