తెలంగాణ

BRS: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ దళం వ్యూహం ఇదేనా?

BRS: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక సమరానికి నగారా మోగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, టికెట్ల కోసం గులాబీ గూటిలో భారీ పోటీ నెలకొంది. టికెట్ తమకే వస్తుందన్న ఆశతో తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆశావహులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనూహ్య ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడే అభ్యర్థుల ప్రకటన ఉండబోదని కుండబద్దలు కొడుతూ, గ్రౌండ్‌లో సరికొత్త పొలిటికల్ మైండ్‌గేమ్‌కు ఆయన తెరలేపారట.ఎన్నికలకు ముందే అభ్యర్థిని ఖరారు చేస్తే పార్టీకి జరిగే నష్టాలను అధిష్టానం లోతుగా బేరీజు వేస్తోందని తెలుస్తుంది. బీఆర్ఎస్‌లో ఒక్కో స్థానానికి డజను మందికి పైగా కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పుడే ఒకరి పేరు ప్రకటిస్తే మిగిలిన ఆశావహులు అసంతృప్తితో దూరమయ్యే ప్రమాదం ఉందని అగ్ర నాయకత్వం ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. వారు ఓటర్ల నమోదును పట్టించుకోకపోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని భావిస్తున్నట్లు తెలుస్తుంది.