తెలంగాణ
BRS: కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్.. గులాబీలో జోష్ కోసం సీఎం అడ్డాలోనే భారీ దంగల్!!..
రాష్ట్రంలో రాజకీయ పోరు రోజు రోజుకు ముదురుతుంది. మళ్ళీ అధికార పీఠం దక్కించుకోవాలని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ వ్యూహా రచనలో భాగంగా బీఆర్ఎస్ పై ఆరోపణలు, విమర్శల బాణాలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు గులాబీ దళం వ్యూహాలు రచిస్తోంది.
ఏకంగా ముఖ్యమంత్రి సొంత అడ్డా అయిన కొడంగల్‌లోనే భారీ బహిరంగ సభ నిర్వహించి సవాల్ విసిరేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమల్లో జాప్యాన్ని ఎండగడుతూ రేవంత్ సర్కార్‌ను డిఫెన్స్‌లో పడేసేందుకు, గులాబీ కేడర్‌లో కొత్త జోష్ నింపేందుకు పావులు కదుపుతున్నారు!..
