తెలంగాణ

భూదందాల నుంచి ఇసుక అక్రమ రవాణ వరకు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవినీతి చిట్టా ఇదే?

Buyyani Manohar Reddy: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వ్యవహారశైలిపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే భూముల వ్యవహారాలపైనే ఎమ్మెల్యే కుటుంబానికి ఆసక్తి ఎక్కువగా ఉందని విమర్శించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఎమ్మెల్యే వ్యవహారాలపై సీఎం స్థాయిలోనే ప్రస్తావనలు రావడం ఆయన తీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోందన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, నాయకులు నర్సింహులు, నరేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు పరిమళ, శోభారాణి మాట్లాడారు.