తెలంగాణ
BRS: 'బీఆర్ఎస్ 3.0లో దయాదాక్షిణ్యాలు ఉండవు': ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆయన పలు తీవ్రమైన ప్రశ్నలను సంధించారు. కుటుంబ సభ్యుల భద్రత, కాంగ్రెస్ నేతల వీఐపీ సంస్కృతి, ఓఎస్డీ సుమంత్ కేసు విషయంలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరులైన తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డిలకు ఏ ప్రాతిపదికన 2+2 సెక్యూరిటీ గన్మెన్లను కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
