BRS : కేటీఆర్, హరీశ్ సహా 14 మందిపై కేసు
రాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. నిన్న ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సమయంలో మెయిన్ గేటు వద్ద జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ నేతలు పలువురి గాయాలు అయిన విషయం తెలిసిందే.మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లదుస్తులు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీలోనికి వెళ్లరాదని బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోగా.. ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆ కామెంట్స్‌కు గాను స్పీకర్ నిన్న శాసనసభలో కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిసింది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను అవమానించినందుకు ఎమ్మెల్సీ తాతా మధును మండలికి రాకుండా ఆయన సభ్యత్వాన్ని బర్తరఫ్ చేయాలని చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ తాతా మధు,నవీన్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి తోడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు సహా మరో 14 మంది నేతలపై పోలీసులు 5 కేసులు నమోదు చేసినట్టు సమాచారం.
