‘అన్నా ఆకలేస్తుంది.. ఇంటికి తీసుకెళ్లండి’ బోరున ఏడ్చేసిన పిల్లాడు!
ఏపీలో హృదయాన్ని కలిచివేసే ఓ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ బాలుడు మేకలు కాస్తూ తిరుగుతుండగా.. అతన్ని పలకరించిన వ్యక్తులకు తన గోడును చెప్పుకోని కంటతడిపెట్టాడు. ఏడుస్తూ తన బాధను చెప్పుకోగా ఆ వ్యక్తుల నోటి వెంట మాట రాలేదని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అన్నా ఆకలేస్తుంది ఇంటికి తీసుకెళ్లండి’ అంటూ ఆ బాలుడు కంటతడి పెట్టుకున్నాడు. సుమారు 8 ఏళ్ల వయస్సులో అతను పడుతున్న కష్టాన్ని చూసిన వారంతా అయ్యో పాపం..అంటున్నారు. వివరాల్లోకివెళితే.. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం రాచవారిపాలెంలో రామయ్య అనే బాలుడుమేకలు మేపుతూ కనిపించాడు. అప్పటికే ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్న రామయ్యను ఇద్దరు వ్యక్తులు గమనించారు.అతని వద్దకు వెళ్లి పలకరిస్తే ఆకలిగా ఉందని, ఇంటికి తీసుకెళ్లండని బోరున ఏడ్చేశాడు. తనకు సరిగ్గా అన్నం పెట్టడం లేదని, చాలా ఆకలేస్తోందంటూ కన్నీరుమున్నీరయ్యాడు.
