టాప్ న్యూస్
Broken Rice: నూకలతో ఇథనాల్ తయారీ.. ధరలపై భారం?
ఇథనాల్ ఉత్పత్తికి విరిగిన బియ్యాన్ని (నూకలను) కేటాయించడం వల్ల దేశంలో ఆహార ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడటం లేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభ వేదికగా స్పష్టం చేసింది. జాతీయ ఆహార భద్రతతో పాటు ప్రజా సంక్షేమ పథకాలకు అవసరమైన నిల్వలను సమకూర్చుకున్న తర్వాత మాత్రమే, ఎఫ్సీఐ వద్ద మిగులుగా ఉన్న బియ్యాన్ని ఇంధన తయారీకి ఇస్తున్నట్లు వెల్లడించింది.
