దునియా

మోడీ డిన్నర్‌ను స్కిప్ చేసిన చైనా అధ్యక్షుడు.. అసలు మతలబు ఇదే!

దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు తొలిరోజే అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సదస్సుకు హాజరైన సభ్యదేశాల అధినేతలకు, విదేశీ ప్రతినిధులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అధికారిక విందును ఏర్పాటు చేశారు. అయితే ఈ గ్రాండ్ డిన్నర్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకాకపోవడం ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారింది. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్న కీలక తరుణంలో, జిన్‌పింగ్ విందుకు దూరంగా ఉండటం రకరకాల ఊహాగానాలకు తావిచ్చింది.దీంతో భారత్-చైనా మధ్య ఏవైనా అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయా అన్న చర్చ మొదలైనప్పటికీ.. జిన్‌పింగ్ గైర్హాజరు వెనుక అసలు కారణం వేరే ఉందని దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. సుదీర్ఘ విమాన ప్రయాణం, టైమ్ జోన్ మార్పు (జెట్‌లాగ్) కారణంగా ఆయన తీవ్రమైన అలసటకు గురైనట్లు సమాచారం. ఢిల్లీ చేరుకున్న వెంటనే ఏమాత్రం విరామం లేకుండా వరుస అధికారిక సమావేశాల్లో పాల్గొనడం, మోడీతో కీలక భేటీ ఉండటంతో షెడ్యూల్ మొత్తం బిజీగా గడిచిందని, తీవ్ర అలసట కారణంగానే విశ్రాంతి తీసుకునేందుకు డిన్నర్‌కు హాజరుకాలేకపోయారని తెలుస్తోంది.