దునియా

"బ్రిక్స్ దేశాలు ఎవరికీ శత్రువులు కాదు'.. మోడీ స్ట్రాంగ్ మెసేజ్..

BRICS: ప్రపంచ రాజకీయాల్లో శతాబ్దాలుగా సాగుతున్న అగ్రరాజ్యాల పెత్తనానికి ఇక కాలం చెల్లినట్లేనా? కేవలం కొద్దిమంది పెత్తందారులు నిర్ణయాలు తీసుకోవడం, మిగిలిన ప్రపంచం వాటిని గుడ్డిగా పాటించడమనే వ్యవస్థకు తెరపడనుందా? ఢిల్లీ వేదికగా జరుగుతోన్న బ్రిక్స్ వార్షిక సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వేదికలను ఒక్కసారిగా షేక్ చేసింది. "గ్లోబల్ సౌత్ దేశాలు ఇకపై నిబంధనలు పాటించేవిగా మాత్రమే ఉండకూడదు.. ప్రపంచానికి నిబంధనలను నిర్దేశించే స్థాయికి ఎదగాలి" అంటూ మోడీ చేసిన సింహగర్జన పాశ్చాత్య దేశాలకు నేరుగా పంపిన స్ట్రాంగ్ వార్నింగ్‌గా కనిపిస్తోంది.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) వైఖరిపై ప్రధాని మోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన నిబంధనలతో సాగుతున్న భద్రతామండలిలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా, అర్హత కలిగిన ఇతర దేశాలకు తక్షణమే శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కాలానికి అనుగుణంగా మారకపోతే అంతర్జాతీయ సంస్థల ఉనికికే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.