టాప్ న్యూస్

Breaking : హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 8 ప్రయివేటు కాలేజీల హస్తం?

హైదరాబాద్‌లోని కొన్ని ప్రయివేట్ కాలేజీలు భారీ మోసానికి పాల్పడ్డాయి. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి తమ కాలేజీలకు అన్ని అనుమతులు ఉన్నాయని ఇంటర్ బోర్డుకు సదరు నకిలీ అనుమతి పత్రాలను సమర్పించినట్టు తెలిసింది.. ఈ వ్యవహారం కాస్త ప్రస్తుతం సంచలనంగా మారింది. హైడ్రా కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీకి గురవ్వగా.. దీని వెనుక ఓ ముఠా హస్తం ఉన్నట్టు సమాచారం. ఈ తతంగం అంతా 8 ప్రముఖ ప్రైవేటు కళాశాలల ఆధ్వర్యంలో నడిచినట్టు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.