క్రైమ్

brazil : 16 మందిని చంపిన ‘దోమ’.. దట్టమైన అడవుల్లో దూరి!

16 మందిని దారుణంగా హత్యచేసిన ‘దోమ’ ఎట్టకేలకు చిక్కాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దోమ అంటే రక్తం పీలుస్తుంది కదా? అంతమందిని ఎలా చంపిందని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయొచ్చు. ఇక్కడ దోమ అంటే రక్తం పీల్చే కీటకం కాదు. దోమ అంటే మనిషే..బ్రెజిల్‌లో వరుస హత్యలకు కారణం ఈ సీరియల్ కిల్లర్ జోర్లాన్ లోప్స్ డా సిల్వా (33). నిందితుడు హత్యచేశాక పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు అడవుల్లో గుడారాలు వేసుకుని తలదాచుకున్నట్టు తేలింది. సన్నని దేహదారుడ్యం కలిగి ఉన్నందునే అందరూ అతన్ని మస్కిటో (దోమ) అని పిలిచేవారు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే..బ్రెజిల్‌లోని పరైబా రాష్ట్రంలో ఉండే జొర్లాన్ మారుమూల ప్రాంతాల్లో వరుస హత్యలకు పాల్పడినట్టు సమాచారం. గత మూడు నెలల్లో 16 మందిని అత్యంత దారుణంగా హతమార్చినట్టు అతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకరిని చంపేసిన వెంటనే దట్టమైన అడవుల్లోకి వెళ్లి దాక్కోవడం అతనికి అలవాటు.