తెలంగాణ

ఆస్తి కోసం బరితెగింపు.. మంచం పట్టిన తల్లిని కూడా వదల్లేదు

ఆస్తి కోసం కొందరు బరితెగిస్తున్నారు.రక్తసంబంధం, తల్లిదండ్రులు అని చూడటం లేదు. తమకు ఆస్తి రాలేదు అన్న కోపంలో కన్నవారి మీదే దాడులకు పాల్పడుతున్నారు. కొందరు ఇంట్లో నుంచి బయటకు గెంటివేస్తున్నారు. మరికొందరు భౌతికంగా దాడులకు పాల్పడటం, ఆహారం ఇవ్వకుండా తీవ్ర వేధింపులకు గురిచేయడం వంటివి చేస్తున్నారు. మరికొన్ని ఘటనల్లో ఆస్తి కోసం ఏకంగా హత్యలు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కాగా, ఆస్తి కోసం పక్షవాతంతో మంచానికే పరిమితమైన తల్లిపైన కొడుకు అతని భార్య దాడికి పాల్పడినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇంట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డు అయ్యాయి.వివరాల్లోకివెళితే.. కూకట్‌పల్లి అల్విన్ కాలనీకి చెందిన బ్యాంకు ఉద్యోగి టి. నాగార్జునను గత కొంతకాలంగా అన్న, వదిన, ఆమె సోదరుడి వేధిస్తున్నట్టు ఆరోపించాడు. ఆస్తి వివాదంలో వాళ్లంతా ఇబ్బందులకు గురిచేయడంతో పాటు దాడులకు పాల్పడుతున్నారని వాపోయాడు.తనతో పాటు పక్షవాతంతో బాధపడుతున్న తల్లిపైనా పలుమార్లు భౌతిక దాడులు చేశారని ఆవేదన వ్యక్తంచేశాడు.