International

Brain Surgery: కపాలం తెరవకుండానే మెదడు సర్జరీ.. భారత సంతతి వైద్యుడి అరుదైన రికార్డు!

వైద్య చరిత్రలో ఓ వినూత్న విప్లవానికి తెరలేచింది. సాధారణంగా మెదడులోని కణితులను తొలగించాలంటే కపాలం (పుర్రె) తెరవడం తప్పనిసరి. అయితే ఎలాంటి ఓపెన్ సర్జరీ అవసరం లేకుండా, కేవలం ముక్కు మార్గం గుండానే మెదడులోని ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించే సరికొత్త విధానానికి భారత సంతతికి చెందిన అమెరికన్ ఆర్మీ సర్జన్ మేజర్ జగత్‌కుమార్ పటేల్ శ్రీకారం చుట్టారు.